రైతు మామూలోడు కాదు..పత్తిచేనులో గంజాయి సాగు

రైతు మామూలోడు కాదు..పత్తిచేనులో గంజాయి సాగు

నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బెంబర గ్రామ శివారులో గంజాయి సాగు చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. శనివారం ఉదయం నుంచి గ్రామ శివారులోని పంట పొలాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ముధోల్ సీఐ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో పంట పొలాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో గ్రామ శివారులోని ఓ పత్తి చేనులో గంజాయి మొక్కలను గుర్తించారు.

సమాచారం అందుకున్న భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఘటనా స్థలానికి చేరుకుని పత్తి చేనులో లభ్యమైన గంజాయి మొక్కలను పరిశీలించారు. గంజాయి సాగుకు సంబంధించి పోలీసులు తదుపరి విచారణ చేపడుతున్నారు. ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.